బీహార్ రాష్ట్రంలో వరుస వంతెనలు కూలడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే అక్కడ డజన్‌కు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ వంతు వచ్చింది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం విశేషం. ఈ వంతెనను ఆర్‌సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు.
గురువారం సాయంత్రం 4.15 గంటలకు ఈ సంఘటన జరిగిందని అధికారి తెలిపారు. కానీ పునాది మాత్రం చెక్కుచెదరలేదన్నారు. టవర్ మాత్రమే కూలిపోయిందని చెప్పారు. సాంకేతిక కమిటీ సంఘటనను పరిశీలించి.. ఏమి తప్పు జరిగిందో చూస్తుందని అధికారి తెలిపారు.
పనులు నాసిరకంగా, నిర్లక్ష్యంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే అథారిటీ మరియు ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదని స్థానిక నివాసి ఆరోపించారు. సాధారణంగా ప్రతిరోజూ 40 మంది కార్మికులు ఈ సమయంలో పని చేస్తారని మరో అధికారి తెలిపారు. ఈ రోజు వంతెనపై ఎవరూ పని చేయడం లేదని అధికారి తెలిపారు.
Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE
— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024