వరుసగా మరోసారి స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య కారణంగా భారీగా పతనమైంది. భారీ నష్టాలను చవిచూసింది. ఇక మరికొన్ని గంటల్లో పార్లమెంట్‌లో కేంద్రం 2024 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. కానీ మార్కెట్ అంచనాలను అందుకులేకపోయింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిగా ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి 80.502 దగ్గర ముగియగా.. నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 24, 509 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 83.66 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Beerla Ilaiah: హరీష్ రావు.. ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకో
నిఫ్టీలో విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ మరియు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోగా.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: Lavanya: లావణ్య బండారం బట్టబయలు చేసిన రాజ్ తరుణ్ ఫ్రెండ్… అతను రేప్ చేస్తే?