గురువారం సాయంత్రం మెక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, మార్కెట్లు, ఆయా కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక విమాన ప్రయాణికుల అవస్థలైతే మామూలుగా లేవు. ఎయిర్‌పోర్టుల వరకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసి పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంకు సర్వీసులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: CrowdStrike CEO: క్షమాపణలు చెప్పిన క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ..
తాజా పరిణామాల నేపథ్యంలో 300 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. అంతర్జాతీయ విమానయాన వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. మళ్లీ బుక్ చేసుకునే అవకాశం, రీఫండ్ సదుపాయం కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కొత్త అస్త్రం?