మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కలకాలం తోడుగా ఉండాల్సి భర్తే కాలయముడయ్యాడు. గర్భిణీగా ఉన్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి సజీవదహనం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: తమిళనాడులో ఆరుగురు రష్యా పౌరులు అరెస్ట్..
23 ఏళ్ల రీనా.. తాండి ఖుర్దాకు చెందిన మిథున్ తన్వార్‌ను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈమెకు ఏడాదిన్నర కుమార్తె ఉంది. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీగా ఉంది. అయితే ఇటీవల భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. ఇటీవల భర్త భూమి కొనుగోలు చేశాక.. ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అప్పు తీర్చేందుకు మరింత డబ్బు తీసుకురావాలని తగాదా పెట్టుకున్నారు. దీంతో రెచ్చిపోయిన భర్త, అత్తమామలు.. గర్భిణీగా ఉన్న రీనాను ముక్కలు.. ముక్కలు నరికి.. దహనం చేశారు. ఇతర బంధువుల సమాచారంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా.. మంటల్లో కాలిపోతున్న రీనాను చూసి గుండెలు అవిసేలా ఏడ్చారు. అప్పటికే ఆమె 80 శాతం కాలిపోయింది. ఇంతలో అక్కడ నుంచి భర్త, అతడి కుటుంబ సభ్యులు పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులు.. వరకట్న వేధింపులతో చంపేసి.. దహనం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Budget 2024: స్నేహపూర్వక దేశాలకు భారీ సాయం..రూ.5,667.56 కోట్ల కేటాయింపు