Trump effect: అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ రాజీనామా
- అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ రాజీనామా
- ట్రంప్‌పై దాడి నేపథ్యంలో రిజైన్
- భద్రతా వైఫల్యానికి తానే కారణమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీనికి సీక్రెట్ సర్వీస్ చీఫ్ బాధ్యత వహించింది. భద్రతా లోపానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2022 నుంచి సీక్రెట్ ఏజెన్సీకి చీటిల్ సారథ్యం వహిస్తున్నారు. ట్రంప్‌పై దాడి తర్వాత రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
Also Read
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని నిరోధించే లక్ష్యంలో ఏజెన్సీ విఫలమైందని సోమవారం చీటిల్ అంగీకరించారు. మొత్తానికి ఒక రోజు తర్వాత సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ మంగళవారం రాజీనామా చేశారు. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైట్ హౌస్ అభ్యర్థి ట్రంప్‌పై 20 ఏళ్ల ముష్కరుడు గాయపరచడంతో చీటిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పని వారం క్రితమే చేసి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాల సీక్రెట్ సర్వీస్ కాలంలో ఈ ఘటన వైఫల్యం చెందిందని వెల్లడించారు.
ట్రంప్ ప్రచార కార్యక్రమంలో ప్రసంగించడం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే AR తరహా రైఫిల్‌తో దుండగుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. సమీపంలోని భవనం పైకప్పుపై కూర్చున్న అతను ఎనిమిది షాట్లలో కాల్పులు జరిపాడు. అనంతరం 30 సెకన్లలోపు సీక్రెట్ సర్వీస్ చేత కాల్చి చంపబడ్డాడు. ర్యాలీకి హాజరైన వారు గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు వదిలారు.
చీటిల్ 27 సంవత్సరాల పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశారు. 2021లో పెప్సికోకి ఉత్తర అమెరికాలో సెక్యూరిటీ హెడ్‌గా మారారు. అనంతరం 2022లో ప్రెసిడెంట్ జో బిడెన్ ఆమెను ఏజెన్సీకి అధిపతిగా నియమించారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మరో రికార్డు
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!