దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు. గత శుక్రవారం మైక్రోసాప్ట్ విండోస్ సమస్యతో మొదలైన నష్టాలు.. వరుసగా నాలుగో రోజు కూడా అదే ఒరవడి కొనసాగింది. సెన్సెక్స్ 280 పాయింట్లు నష్టపోయి 80, 148 దగ్గర ముగియగా.. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 24, 412 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.71 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Sundeep Kishan: నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతున్నా
నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టపోగా… హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, టెక్ మహీంద్రా, బిపిసిఎల్, ఎన్‌టిపిసి మరియు టాటా మోటార్స్ లాభపడ్డాయి. సెక్టోరల్‌లో హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, టెలికాం మరియు పవర్ 1-2 శాతం పెరగగా, FMCG మరియు బ్యాంక్ ఇండెక్స్ 0.5-1 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?