త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రచారంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. బహిరంగ ఎన్నికల ప్రచారానికి ట్రంప్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Babu Mohan: నువ్వెంతా? నీ బతుకెంత?.. ఆర్పీపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు
2024 ఎన్నికల ప్రచారం కోసం భారీ సభలు నిర్వహించేందుకు భద్రత కల్పించాలని ట్రంప్ కోరగా..అందుకు సీక్రెట్ సర్వీస్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రచారాన్ని ఇండోర్ ప్రదేశాలకే పరిమితం చేస్తారని ఆయన బృందం వెల్లడించినట్లు సమాచారం. ఒకవేళ బహిరంగ ప్రచారానికి వచ్చినా.. రాకపోకల కట్టడికి వీలున్న చిన్నపాటి స్టేడియాల్లోనే ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Budget: రేపే తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి
ఇదిలా ఉంటే ట్రంప్‌పై హత్యాయత్న ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ మంగళవారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాజీ అధ్యక్షునికి భద్రత కల్పించడంలో జరిగిన వైఫల్యానికి బాధ్యత వహిస్తున్నానని, భారమైన హృదయంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.