EC: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం? త్వరలోనే ఈసీ నోటిఫికేషన్!
- జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం?
- త్వరలోనే ఈసీ నోటిఫికేషన్!
- గురువారం శ్రీనగర్‌లో ఈసీ బృందం పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల బృందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్.సంధు నేతృత్వంలోని ఎన్నికల బృందం శ్రీనగర్‌లో పర్యటించింది. శ్రీనగర్‌లో అధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే జమ్మూకాశ్మీర్ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగడం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అంతేకాకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు.. సెప్టెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘంలో కదిలిక వచ్చింది. గురువారం శ్రీనగర్‌లో పర్యటించి.. పరిస్థితుల్ని సమీక్షించారు. 20 జిల్లాల సీనియర్ పోలీసు అధికారులను, రాజకీయ పార్టీలతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ పఠానియా పేర్కొన్నారు.
Also Read
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తిరిగి ఎన్నికలు జరగలేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. జూన్ 2018 నుంచి కేంద్ర పాలనలో ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం దాని ప్రత్యేక హోదా కూడా ఆగస్టు 2019లో రద్దు చేయబడింది. దీనిని జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్‌గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటి వరకు ఎన్నికల సంఘం మూడు సార్లు పర్యటించింది. అంతకుముందు 2019, 2024లో కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా సన్నాహాలు చేశారు. కానీ ఎన్నికలు మాత్రం జరగలేదు. అయితే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. గత నెలలో శ్రీనగర్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, దాని రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తానని ప్రకటించారు.
An ECI delegation led by CEC Rajiv Kumar and ECs Gyanesh Kumar and Dr. SS Sandhu arrived at Srinagar today to review poll preparedness in J&K. #AssemblyElections #ECI pic.twitter.com/aKfurMoCV0
— Election Commission of India (@ECISVEEP) August 8, 2024
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!