పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు భారీ ఘనస్వాగతం లభించింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న మను భాకర్.. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలను సోనియాకు చూపించారు. అక్కడ విశేషాలను మను భాకర్ పంచుకున్నారు. సోనియాను కలిసిన వారిలో ఆమె తల్లిదండ్రులతో పాటు బంధువులు ఉన్నారు. అలాగే మను భాకర్ కోచ్ జస్పాల్ రానా కూడా ఉన్నారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయింది.
#WATCH | Olympic medalist Manu Bhaker leaves from the residence of Congress Parliamentary Party Chairperson Sonia Gandhi after meeting her, in Delhi pic.twitter.com/Dr7mTsYeNf
— ANI (@ANI) August 7, 2024
Delhi | Olympic medalist Manu Bhaker met Congress Parliamentary Party Chairperson Sonia Gandhi at her 10, Janpath residence today
(Photo source: Congress) pic.twitter.com/mwYx2BywO4
— ANI (@ANI) August 7, 2024