అది కాలేజీ ఈవెంట్. సీనియర్లు, జూనియర్లు అంతా ఆడిటోరియంలో కూర్చున్నారు. సీనియర్ అబ్బాయి.. జూనియర్ అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తేందుకు సిద్ధపడ్డారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు.
ప్రధాని మోడీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి కావడం విశేషం. కొత్త రైళ్లు తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి.
దాదాపు 40 ఏళ్ల తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనపై హత్య కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే దేశమంతా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. న్యాయం కోసం వైద్యులు, నర్సులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది.
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాను మట్టుబెట్టింది. ప్రస్తుతం హమాస్ నాయకులే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ మధ్య హమాస్ అగ్ర నేత హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లో స్థానిక హమాస్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీ గూటికి చేరారు. రాజధాని రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపై సోరెన్ బీజేపీలో చేరారు.
ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాల్ఘర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంతో మీ మనసులు గాయపడ్డాయని తనకు తెలుసన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం ఉదయం రికార్డ్ స్థాయిలో ప్రారంభమైంది. చివరిదాకా అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి.
ఆరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాన్ ఏర్పడబోతుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం మరియు ఈశాన్య ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని.. అది కాస్తా 6 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.