Viral video: కేటుగాళ్ల నయా ప్లాన్.. రూ.5 లక్షల నగలతో పరారీ
- పూణెలో రెచ్చిపోయిన కేటుగాళ్లు
- వృద్ధ దంపతుల దృష్టి మళ్లించి బ్యాగ్‌తో పరారీ
- 5 లక్షల నగదు.. సెల్‌ఫోన్లు అపహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వృద్ధ దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. దారి మధ్యలో ఆకలి వేస్తోందని రోడ్డు పక్కన ఆపారు. భర్త వడాపావ్ తెచ్చేందుకు దుకాణంలోకి వెళ్లాడు. భార్య స్కూటీ దగ్గరే నిలబడింది. ఇద్దరు కంత్రీగాళ్లు ఆమె చుట్టే తిరుగుతున్నారు. కానీ ఆమె అది గమనించలేదు. ఒకడు ఆమె దృష్టిని మళ్లించగానే.. ఇంకొకడు స్కూటీపై ఉన్న నగల బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్‌మెన్స్
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణం దగ్గర వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. పెద్దాయన ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా.. మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత.. బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు. రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ కేటుగాడు తప్పించుకుని పారిపోయాడు.
ఇది కూడా చదవండి: Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్‌ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in Shewalewadi
Reported by: Laxman More
Video Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!