US: నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి.. అరెస్ట్
- అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం
- నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
- నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో నేపాల్‌కు చెందిన మున పాండే అనే విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు పొట్టనపెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే హత్యకు గురైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో పాండే మంచం మీదే శవమై కనిపించింది.
సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో హ్యూస్టన్ అపార్ట్‌మెంట్‌లో మున పాండే తుపాకీ గాయాలతో పడి ఉందని పోలీసులు తెలిపారు. మున పాండేను అమెరికాలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీ సమయంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్

అపార్ట్‌మెంట్‌లో మృతదేహం గురించి తమకు అనుమానాస్పద కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మున పాండే 2021లో నేపాల్ నుంచి అమెరికాలోని హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లింది. మున పాండేను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె ఫోన్‌లోకి అందుబాటులోకి రాలేదు. ఈ మేరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు చెప్పారు. పాండేపై మూడు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మంచం మీదే ఆమె పడి ఉంది. దర్యాప్తులో నిజం తెలుస్తుందని నేపాల్ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే మున పాండే తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాండే తల్లి హూస్టన్‌కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంలో సహాయం చేసేందుకు అసోసియేషన్ నేపాల్ కాన్సులేట్‌తో సంప్రదింపులు చేస్తోంది.
మున పాండే కోసం నేపాల్ అసోసియేషన్ GoFundMe పేరుతో ఫండ్ కలెక్ట్ చేస్తోంది. వచ్చిన మొత్తాన్ని పాండే అంత్యక్రియలకు.. ఇతర ఖర్చులకు అందజేయనున్నారు. ఇప్పటికే అసోసియేషన్ డబ్బు కలెక్ట్ చేసింది. పాండే తల్లి.. అమెరికా చేరుకోగానే అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!