దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ తాజా గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 83 వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా 25, 400కు పైగా మార్కు క్రాస్ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఈ జోష్ కనిపించినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 83, 079 దగ్గర ముగియగా.. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 25, 418 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Syed Sohel: బిగ్ బాస్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం
నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ భారీ లాభాల్లో కొనసాగగా.. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ నష్టపోయాయి. సెక్టార్‌లో ఆటో, మెటల్, మీడియా ఒక్కొక్కటి 0.5% తగ్గాయి.
ఇది కూడా చదవండి: AP New Excise Policy: అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం