Puja Khedkar: వివాదంగా పూజా ఖేద్కర్ తండ్రి ఎన్నికల నామినేషన్.. కన్‌ఫ్యూజన్‌కు కారణమిదే!
- వివాదంగా పూజా ఖేద్కర్ తండ్రి ఎన్నికల నామినేషన్
- లోక్‌సభలో ఒకలా.. అసెంబ్లీ ఎన్నికల్లో మరొక విధంగా వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు సంబంధించిన వార్త మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
దిలీప్ ఖేద్కర్ ఎన్నికల అఫిడవిట్‌లో వైవాహిక స్థితిని గురించి కన్‌కఫ్యూజ్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌కు విరుద్ధంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భార్యతో కలిసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె పేరు, ఆదాయం, ఆస్తి వివరాలు తెలియజేశారు. కానీ తాజాగా దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో మాత్రం విడాకులు తీసుకున్నట్లు పేర్కొ్న్నారు. ప్రస్తుతం భార్యతో ఎలాంటి వైవాహిక సంబంధాలు లేవని వెల్లడించారు. దీంతో దిలీప్ ఖేద్కర్ అఫిడవిట్ వివాదంగా మారింది.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
2010లోనే విడాకులు..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దిలీప్ ఖేద్కర్ తన అఫిడవిట్‌లో తన భార్య పేరు మనోరమ ఖేద్కర్ అని పేర్కొన్నారు. ఆస్తి, ఆదాయం వివరాలు తెలియజేశారు. వాస్తవానికి వీరిద్దరికీ 2010లోనే విడాకులు మంజూరు అయినట్లు సమాచారం. దిలీప్ మరియు మనోరమ ఖేద్కర్ 2009లో పూణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో జూన్ 25, 2010న విడిపోయారు. చట్టబద్ధంగా విడిపోయినప్పటికీ పూణెలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో ఇద్దరూ సహజీవనం కొనసాగించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒకలా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా వైవాహిక స్థితి తెలియజేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!