రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి లక్ష రూపాయులు అడ్వాన్స్ తీసుకున్నాడు. తీరా కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మహారాష్ట్ర, జార్ఖండ్లో నగదు ప్రవాహంలాగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా డబ్బు కట్టలు తరలిస్తున్నారు.
వ్యాపారాలకు తాను వ్యతిరేకం అని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు
కేరళ పోలీసుల తీరుపై కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. తనిఖీల పేరుతో పార్టీ మహిళా నేతలు ఉన్న గదుల్లోకి ప్రవేశించడం సరికాదంటూ మండిపడ్డారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు పశ్చిమ బెంగాల్ కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓట్లు కోసం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాత్రం మరో అడుగు ముందుకేసి.. తనను అసెంబ్లీకి పంపిస్తే.. పెళ్లికాని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ వార్త వైరల్గా మారింది.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్.. ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండర్న్ను తొలగించారు. దీంతో బుధవారం సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. దేశానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో లిండర్న్ ద్రోహం చేసినట్లుగా ఓలాఫ్ భావించారు.
ఆర్థిక కష్టాలతో కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం సమాప్తమైంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని్కయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది. పసిడి, చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.