Aadhaar cards: ఆధార్ అలర్ట్.. అప్‌డేట్‌కి చివరిరోజు ఎప్పుడంటే..!
- ఆధార్ అలర్ట్
- అప్‌డేట్‌కి డిసెంబర్ 14 చివరిరోజు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం అయింది. దేనికైనా ఆధార్ కార్డే అడుగుతున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు. ఆధార్ కార్డుకు ఎంత విలువ ఉందో. అయితే ఆధార్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ సమాచారం మీకోసమే.
ఆధార్ కార్డు తీసుకుని అప్‌డేట్ చేయనివారి ఆధార్ కార్డులు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఆధార్ కార్డులను గడువులోపు అప్‌డేట్ చేసుకోవల్సిన అవసరం ఉంది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉచిత ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. ‘‘MyAadhaar’’ పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. లేదంటే రద్దయ్యే అవకాశాలున్నాయి. పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువు కూడా దగ్గర పడుతోంది. దీన్ని పొడిగిస్తుందో లేదో తెలియదు. కాబట్టి అప్‌డేట్ చేసుకుంటే మంచిది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అప్‌డేట్‌కు అవసరమైన పత్రాలు
రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్‌ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో అప్‌డేట్ చేసుకోవచ్చు. ‘‘MyAadhaar’’ పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయాలి. సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!