PM Modi: డ్రైవర్ సీటు కోసం ఇండియా కూటమిలో కుమ్ములాటలు
- డ్రైవర్ సీటు కోసం ఇండియా కూటమిలో కుమ్ములాటలు
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: సిద్ధరామయ్య ‘‘మాస్ లీడర్’’.. అందుకే బీజేపీ ఖతం చేయాలని చూస్తోంది..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కాశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోడీ స్ప ష్టం చేశారు.
మోడీ పర్యటన..
నవంబర్ 9న ప్రధాని మోడీ మధ్యాహ్నం అకోలాలో, మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించనున్నారు. నవంబర్ 12న చిమూర్, షోలాపూర్‌లలో ర్యాలీల్లో పాల్గొని సాయంత్రం పూణెలో జరిగే రోడ్‌షోలో మోడీ పాల్గొంటారు. నవంబర్ 14న ఛత్రపతి సంభాజీనగర్, రాయ్‌గఢ్, ముంబైలో చివరిగా ర్యాలీలకు ప్లాన్ చేశారు. 288 సీట్ల మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఫలితాలు మూడు రోజుల తర్వాత (నవంబర్ 23) లెక్కించబడతాయి.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం, అజిత్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT), శరద్ పవార్ NCP (SP), కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!