Tailors: మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు.. మహిళా కమిషన్ ప్రతిపాదన!
- మహిళల భద్రత కోసం యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
- ఇకపై మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు
- సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలందించాలి
- మహిళా కమిషన్ ప్రతిపాదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నమ్మినవారే నట్టేట ముంచేస్తున్నారు. అన్ని చోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో మహిళల సేఫ్టీ కోసం ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. పురుషుల ‘బ్యాడ్ టచ్’ నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోకూడదని పేర్కొంది. అలాగే అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం తాము ప్రతిపాదనలు మాత్రమే చేశామని, త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు 28న జరిగిన మహిళా కమిషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం హిమానీ అగర్వాల్ స్పష్టం చేశారు.

Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ప్రతిపాదనలు ఇవే..
అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపింది. సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలందించాలని పేర్కొంది. జిమ్, యోగా సెంటర్లలో అమ్మాయిలకు మహిళా ట్రైనర్లే ఉండాలని… అలాంటి జిమ్‌లను తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేసింది. స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయిని ఉండాలని చెప్పింది. డ్రామా ఆర్ట్ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డ్యాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. మహిళల వస్తువులను విక్రయించే దుకాణాల్లో కూడా తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలని.. కోచింగ్ సెంటర్లలో వాష్‌రూమ్‌లు, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Music Directors: సినిమాను ముంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..