దేశంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది బాధితులు విలవిలలాడారు. అయితే తాజాగా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ అప్రమత్తం అయింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. సంస్థ పేరిట నడుపుతున్న నకిలీ వాట్సప్ గ్రూప్, ఫోన్ నంబర్లతో అప్రమత్తంగా ఉండాలంటూ వినియోగదారులకు సూచించింది. బ్యాంక్ పేరిట వస్తున్న నకిలీ కాల్స్, సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాటిని నమ్మొద్దని కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మొబైల్ నంబర్లు, వాట్సప్ ఛానళ్ల గురించి సమాచారం అందించింది.
ఇది కూడా చదవండి: MSD: థాయ్‌లాండ్‌లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
‘85-HSBC Global academy’ పేరిట కేటుగాళ్లు వాట్సప్ గ్రూప్ నడుపుతున్నారని, ఇది సంస్థకు సంబంధించినది కాదని స్పష్టంచేసింది. ‘8008723938’ ఫోన్ నంబర్‌తో వినియోగదారులను కేటుగాళ్లు కాంటాక్ట్ అవుతున్నారని, ఈ నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మొద్దంటూ మెయిల్ ద్వారా కస్టమర్లకు సూచించింది. కేవలం వాట్సప్‌లోనే కాకుండా ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డిన్, యూట్యూబ్ వేదికగా మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ కాకుండా.. సంస్థ పేరిట వచ్చే ఇతర ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించొద్దని తెలిపింది. పైన తెలిపిన నంబర్లతో వచ్చే కాల్స్‌ని ఫేక్‌గా గుర్తించాలని, అలాంటి వాట్సప్ గ్రూప్‌లలో జాయిన్ అవ్వొద్దంటూ కస్టమర్లను అలర్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Samosas: హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం.. సీఎంకు బీజేపీ సమోసాలు ఆర్డర్