Samosas: హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం.. సీఎంకు బీజేపీ సమోసాలు ఆర్డర్
- హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం
- సీఎంకు బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలు ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూాడా చదవండి: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
Also Read
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
గత నెల (అక్టోబర్) 21న ముఖ్యమంత్రి సుఖు.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఓ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే హోటల్ నుంచి సమోసాలు రాగానే.. వాటిని పోలీసులకు అందజేశారు. అయితే పొరపాటున తమ కొరకే సమోసాలు తెచ్చారేమోనని పోలీస్ సిబ్బంది ఆరగించారు. అయితే వేదికపైకి సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. అయితే సమోసాలు.. లోపలికి వెళ్లకుండా బయటనే సిబ్బంది తినేశారు. అయితే సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసాల కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.
ఇది కూాడా చదవండి: Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్ శర్మ.. ముఖ్యమంత్రి సుఖుకు 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించించడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి 11 సమోసాలు పంపాను. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తుచేసేందుకే అలా చేశాను’’ అని శర్మ వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.
ఇది కూాడా చదవండి: Rain Alert: అలర్ట్.. మరి కొన్ని గంటల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!