అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చేటప్పటికీ సర్వేలన్నీ తలకిందులయ్యాయి. అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. 301 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఏకపక్షంగా అమెరికన్లు.. ట్రంప్ వైపు నిలబడ్డారు.
ఇది కూడా చదవండి: Cyber Crime: మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్.. పెట్టుబడి పేరుతో రూ.2 కోట్ల స్వాహా..
ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 226 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ఆమె పదవీకాలం ఇంకో 72 రోజుల్లో ముగుస్తోంది. తదుపరి ఆమె కార్యాచరణ ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. 2028లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సిద్ధపడతారా? లేదంటే తప్పుకుంటారా? అన్నది సందిగ్ధంగా మారింది. ట్రంప్ చేతిలో ఓటమి తర్వాత అల్మా మేటర్ హావార్డ్ యూనివర్సిటీలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఎస్ ఎన్నికల కోసం తన ప్రచారానికి ఆజ్యం పోసిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె రాజకీయ జీవితాన్ని ముగిస్తారా? కొనసాగిస్తారా? అన్నది అనుమానంగా ఉంది. 2016లో హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అప్పుడు ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు కమలా హారిస్ పరిస్థితి కూడా అలానే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Suicide Attempt: ప్రేమ కోసం సెల్ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం