అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం భారతదేశాన్ని కుదిపేస్తోంది. అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గురువారమైతే మార్కెట్ షేర్లు అన్నీ భారీగా పడిపోయాయి. తాజాగా తమిళనాడులోని స్టాలిక్ ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. అదానీ గ్రూప్ లంచాల ఆరోపణలను స్టాలిన్ తోసిపుచ్చారు. అదానీ గ్రూప్‌తో తమకు సంబంధాలు లేవని పేర్కొంది. దీనిపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: Maruthi Nagar Subramanyam: కడుపుబ్బా నవ్వించే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ వచ్చేస్తుంది.. ఈనెల 24న జీ తెలుగులో
2021లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ అదానీ గ్రూపుతో ఎలాంటి ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. “తమిళనాడు విద్యుత్ శాఖకు అదానీ గ్రూపుతో ఎలాంటి వాణిజ్య లేదా ప్రత్యక్ష సంబంధాలు లేవు. ’’ అని బాలాజీ పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో తమిళనాడు ప్రభుత్వం 1,500 మెగావాట్ల సోలార్ పవర్‌ను యూనిట్‌కు 2.61 రూపాయల పోటీ రేటుతో 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు మృతి..
తాజా ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. “బీజేపీ నేతలు అవినీతి వర్గాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు? అదానీతో తమకు సంబంధం లేకుంటే విచారణకు ఎందుకు ఆదేశించరు? లంచం తీసుకుంటే నిందితులను అరెస్టు చేయండి. బీజేపీకి సీబీఐ, ఈడీ ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అదానీని నిందితుడు నంబర్ 1గా పేర్కొనే ధైర్యం వారికి ఉందా?” అని శరవణన్ అడిగారు. అన్నాడీఎంకే పాలనలో జరిగిన బొగ్గు దిగుమతుల కుంభకోణంపై ప్రాథమిక విచారణకు డీఎంకే ప్రభుత్వం గతంలో ఆమోదం తెలిపిందని, ఇందులో అదానీ గ్రూపు విద్యుత్ ఉత్పత్తికి నాసిరకం బొగ్గును సరఫరా చేసిందని ఆరోపించిందని శరవణన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై ప్రతిపక్ష బీజేపీ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై నిశ్శబ్దంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: US: యూఎస్ బీచ్‌లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?