టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్‌ఎల్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ప్రైవేటు కంపెనీలు భారీగా ధరలు పెంచేయడంతో మళ్లీ కస్టమర్ల బీఎస్‌ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ధరలు పెరగలేదు. పైగా సేవలు కూడా విస్తృతంగా పెరిగాయి. దీంతో సబ్ స్ర్కైబర్ల భారీగా పెరుగుతున్నారు. ట్రాయ్ 2024 సెప్టెంబర్ డేటా ప్రకారం.. ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో 7.96 మిలియన్ల సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. సెప్టెంబర్తో కలుపుకుని వరుసగా మూడవ నెలలో భారీ మొత్తంలో వినియోగదారులు జియో నెట్ వర్క్ను వదిలిపెట్టారు. ఎయిర్‌టెల్ సుమారు 1.43 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, వొడాఫోన్ ఐడియా 1.55 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయారు. బీఎస్ఎన్ఎల్‌కు సెప్టెంబరులో 0.84 మిలియన్ల సబ్ స్ర్కైబర్లు పెరిగారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు దిశా నిర్దేశం
ఇటీవల కాలంలో జియో, ఎయిర్ టెల్, వీఐ కంనీలు టారీఫ్ ప్లాన్లను భారీగా పెంచాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరసమైన ధరలకు ఆకర్శణీయమైన రీచార్జ్ ప్యాకేజీలను ప్రకటించింది. దీంతో సబ్ స్ర్కైబర్లు జియో, ఎయిర్ టెల్, వీఐ నెట్ వర్క్ కు గుడ్ బై చెప్పి బీఎస్ఎన్ఎల్ బాట పడుతున్నారు. దీంతో ప్రైవేట్ టెలికం కంపెనీలు వరుసగా వినియోదారులను కోల్పోతున్నాయి. ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో ఆ సంస్థకు సబ్ స్క్రైబర్లు పెరగడానికి మరొక కారణం చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Devaki Nandana Vasudeva Review: దేవకీ నందన వాసుదేవ రివ్యూ