భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేతతో సహా సహచర భారత నేవీ కయాకర్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది.
ఒడిశాలోని జాజ్పూర్లో కీటకాల గుంపు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద ఎత్తున కీటకాల దండు తరలిరావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్లల్లో పడడంతో బైకర్లు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని ల్యాండ్‌స్కేప్ సరఫరా కంపెనీలో 21 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగిపోయాడు. ముగ్గురు సహోద్యోగులను కాల్చి చంపి.. అనంతరం తుపాకీతో కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. స్వచ్ఛమైన గాలి దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్య నివారణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది.
బీబీసీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ట్రంప్ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకతతో బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ సీఈవో ఇద్దరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
బీహార్‌లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు.