బీహార్‌లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: యువతకు బీజేపీ ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోంది.. విపక్షంపై మోడీ విమర్శలు
ప్రధాని మోడీ కారణంగా రెండు గంటల పాటు ఎన్నికల ప్రచారానికి అంతరాయం కలిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. శుక్రవారం రోహ్తాస్ జిల్లాలోని చెనారిలో ఖర్గే ఎన్నికల ర్యాలీ ఉంది. అదే సమయంలో ఔరంగాబాద్, కైమూర్ జిల్లాల్లో మోడీ ర్యాలీలు ఉన్నాయి. పొరుగునే రోహ్తాస్ ఉంది. అదే సమయంలో మోడీ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఖర్గే హెలికాప్టర్‌ను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ కారణంగానే తన ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది తలెత్తిందన్నారు.
ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
బీజేపీ నాయకులు తమ ర్యాలీలను అడ్డుకుంటున్నారని.. వారి కోసం తమను అడ్డుకుంటున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు ఎల్లప్పుడూ మా ర్యాలీల్లోకి వస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే మోడీ.. ఎన్నికల సమయంలో మాత్రం దేశంలో కనిపిస్తారని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మోడీ ఏ మాత్రం సంకోచించరని ఎద్దేవా చేశారు. మోడీ అబద్ధాలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడరని.. అతని స్నేహితుడు అమిత్ షా కూడా అంతేనని వ్యాఖ్యానించారు. పేదలకు కోటి ఇళ్లుల హామీ నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 121 స్థానాల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. మంగళవారం 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.