తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీనే ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొని ప్రసంగించారు.
భాగ్యనగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆరాంఘర్- జూపార్కు ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
వరంగల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్షణ దీక్షా శిబిరాన్ని కేఏ.పాల్ సందర్శించి మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్ల కుప్పాన్ని ఊహించని రీతిలో అభివద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేసి మాట్లాడారు. త్వరలో కుప్పాన్ని స్వచ్ఛ కుప్పంగా మారుస్తామని తెలిపారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవిని బీజేపీ మహిళా నేతలు కలిశారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక పోస్టు చేశారు. తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో తెలిపారు.
చైనాలోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.