ఇండోనేషియాలోని జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున బస్సు కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. సోమవారం తెల్లవారుజామున బస్సు కాంక్రీట్ బారియర్‌ను కొట్టి బోల్తా పడింది. ఘటనాస్థలిలో 15 మంది చనిపోగా… మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని రక్షణ సంస్థ అధిపతి బుడియోనో తెలిపారు. బస్సు రాజధాని జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియదని.. కారణాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
ప్రస్తుతం రెండు ఆస్పత్రుల్లో 18 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా వారి పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు స్పందించి వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చినట్లు సమాచారం. మృతదేహాలు బస్సు బాడీకి అతుక్కుపోవడంతో బయటకు తీయడం చాలా కష్టంగా మారింది.
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!