తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవిని బీజేపీ మహిళా నేతలు కలిశారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్, కుష్బూ సుందర్, రాధిక, ఉమరాతి రాజన్ తదితరులు కలిశారు.
ఇది కూడా చదవండి: CBI: కేరళలో మహిళ, ఇద్దరు పిల్లల హత్య.. 19 ఏళ్ల తర్వాత నిందితుల అరెస్ట్..
ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన తమిళనాడును కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. నిందితులు డీఎంకే సానుభూతి పరులేనని ఆరోపించాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. ప్రభుత్వ తీరుకు నిరసనగా కొరడా దెబ్బలు తగిలించుకున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేతలు.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan- Ram Charan: బాబాయ్ అబ్బాయ్ బాండింగ్.. భలే ముచ్చటేస్తోంది బాసూ!
ఇదిలా ఉంటే అత్యాచర ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. బాధితురాలికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆదేశించింది. అలాగే విద్యకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడాలని సూచించింది. అలాగే విద్యార్థిని దగ్గర ఎలాంటి ఫీజులు తీసుకోవద్దని అన్నా యూనివర్సిటీకి న్యాయస్థానం చూసించింది.
#WATCH | Chennai, Tamil Nadu: BJP leaders Tamilisai Soundarajan, Kushboo Sundar, Umarathi Rajan and others met Governor R N Ravi seeking justice in the Anna University alleged sexual assault case.
(Source: Raj Bhavan) https://t.co/cfx5PjB7mp pic.twitter.com/LsGEz1JkTZ
— ANI (@ANI) January 4, 2025
#WATCH | Chennai, Tamil Nadu: On the Anna University alleged sexual assault BJP leader Tamilisai Soundarajan says, " We met the governor and submitted a memorandum, he was listening to the matter with much concern…we all condemn the state govt for not letting us raise our voice… pic.twitter.com/DxcpKrOl8g
— ANI (@ANI) January 4, 2025