పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక పోస్టు చేశారు. తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు మూడేళ్ల కాలానికి దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం వచ్చిందని.. అందుకు తాను అంగీకరించలేదన్నారు. తాను పాక్‌లోనే ఉంటా. ఇక్కడే కన్నుమూస్తానని ప్రకటించారు. తన మాట ఒక్కటేనని.. పార్టీ నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు తర్వాతే తన వ్యక్తిగత పరిస్థితి గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన అభిప్రాయం అని చెప్పుకొచ్చారు.
ఇమ్రాన్ ఖాన్‌పై సుమారు 200 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్.. తదితర కేసులకు సంబంధించి ఏడాది కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Shankar: పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్‘లో ఎలివేషన్ ఇచ్చిన శంకర్