ఆర్థిక వ్యవస్థను బలపరిచే లక్ష్యంతో క్యాసినో చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును థాయ్‌లాండ్ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. దీంతో బాక్సింగ్, గుర్రపు పందాలపై బెట్టింగ్ వంటి కొన్ని రకాల జూదానికి అనుమతి లభించింది. ఆగ్నేయాసియా దేశంలో క్యాసినో చట్టవిరుద్ధం. పర్యాటకాన్ని పెంపొందించుకోవడం.. ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవడానికి థాయ్‌లాండ్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా తెలిపారు. ఈ బిల్లు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి, అక్రమ జూదం సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందని షినవత్రా పేర్కొన్నారు. ఇది భవిష్యత్‌లో మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. సెప్టెంబరులో అధికారం చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం దేశ ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Onion Benifits: ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
బిల్లు అమల్లోకి వస్తే థీమ్, వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి టూరిజం కాంప్లెక్సుల్లో క్యాసినోల ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే గుర్రపు పందేలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, అక్రమ బెట్టింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతుంది. ఇటువంటి అక్రమ జూదం సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదాయాన్ని పెంచడం, థాయ్‌లాండ్‌లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలతో తాజా నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మంత్రి పేటోంగ్టార్న్ పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి క్యాసినోలకు అనుమతి ఉండదు. విదేశీయులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. కాగా థాయ్ పౌరులు మాత్రం రూ.148 డాలర్ల ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: TG Govt: కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలు విడుదల..