Maharashtra: మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా.. ఎన్సీపీలో రాజకీయ కలకలం
- రాజకీయ దుమారం రేపిన సర్పంచ్ హత్య కేసు
- మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ధనంజయ్ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ధనంజయ్ ముండే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్ ఆమోదించి.. గవర్నర్ రాధాకృష్ణన్‌కు పంపించారు.
ఇది కూడా చదవండి: Ayesha Khan : అదరహో అందాల ‘అయేషా’
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి అనంతరం చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. హంతకులు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తీసినట్లు సమాచారం. ఈ వీడియోల్లో సర్పంచ్‌ను అత్యంత క్రూరంగా హింసించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో కూటమి ప్రభుత్వం తలొగ్గింది. ఈ నేపథ్యంలో ధనంజయ్ రాజీనామా చేయక తప్పలేదు.
ఇది కూడా చదవండి: SLBC: రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
ధనంజయ్ ముండే.. బీడ్ పార్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధనంజయ్.. దివంగత గోపీనాథ్ ముండే మేనల్లుడు. ధనంజయ్ ముండే 2013లో ఎన్‌సీపీలో చేరారు. 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ విడిపోయినప్పుడు.. అజిత్ పవార్ పక్షాన చేరారు. గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!
తాజావార్తలు
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
-
BSNL దూకుడు.. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!