అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో రెహ్మాన్‌కు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెహ్మాన్.. మాంసం దుకాణంతో పాటు ఆటో నడిపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: VenkyAnil 3 : 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎన్ని సెంటర్స్ అంటే.?
హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. రెహ్మాన్‌ను 10 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కొంతకాలంగా అయోధ్యపై దాడికి కుట్ర పన్నినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్.. ఇస్లామిక్ సమావేశాల్లో కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. 2024, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. ఆ సమయంలో రెహ్మాన్ అనేక రౌండ్లు వేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నిఘా కూడా ఉంచినట్లు కనిపెట్టారు. ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: AP Legislative Council: ఆ పాపం జగన్ రెడ్డిదే.. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదు: మంత్రి గొట్టిపాటి
రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లను రైల్లో అయోధ్యకు తీసుకెళ్లాలని రెహ్మాన్ ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హర్యానా ఎస్‌టీఎఫ్, గుజరాత్‌లోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న పాలి గ్రామం సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో రెహ్మాన్ దాచిపెట్టాడు. రెండింటినీ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. నిందితుడిని ఏటీఎస్ బృందం గుజరాత్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే ఈ కుట్రలో మరింత మంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: SLBC: రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక