రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా సైన్యం దాడులు చేసింది. ఈ మేరకు కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ వెల్లడించారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను ప్రయోగించిందని కీచ్‌కోస్ తెలిపారు. తమ దళాలు తిప్పికొడుతున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Madhuri Dixit : మరపురాని అందం.. మాధురి దీక్షిత్ సొంతం..
యుద్ధం ముగింపునకు సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు కీలక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ లేకుండా చర్చలు జరిపారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే రష్యా దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
ఇటీవల వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం అయ్యారు. ఈ భేటీ చాలా హాట్‌హాట్‌గా సాగింది. సమావేశం నుంచి మధ్యలోనే జెలెన్‌స్కీ నిష్క్రమించారు. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా చర్చలు జరుపుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి వాతావరణం నెలకొనేలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఎంత వరకు పురోగతి ఇచ్చాయో తెలియడం లేదు.
ఇది కూడా చదవండి: Viral Video: ఎవర్రా మీరంతా! పాముతో స్కిప్పింగ్ చేయడమేంటయ్య?