Rahul Gandhi: ఓటర్ల జాబితాపై అన్ని అనుమానాలే.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగాలి
- ఓటర్ల జాబితాపై అన్ని అనుమానాలే
- దీనిపై లోక్‌సభలో చర్చ జరగాలి
- లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షం చర్చ నిర్వహించాలని కోరుకుంటుందని తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాపై చర్చ జరగాలన్నారు. మొత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇది కూడా చదవండి: PGCIL: పరీక్ష లేకుండా పవర్‌గ్రిడ్ లో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు 2.2 లక్షల జీతం
గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన మాజీ కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఇదే అంశంపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
సోమవారం (మార్చి10) నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Kerala: స్లిమ్ గా మారడానికి.. ఆన్‌లైన్ డైట్ పాటించిన యువతి.. చివరకు
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "…Questions are being raised across the country on the voter's list. In every opposition, questions are raised on the voter's list. The entire opposition is just saying that there should be a discussion on the voter's… pic.twitter.com/Ez3fVbsgKP
— ANI (@ANI) March 10, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!