Ranya Rao: రంగంలోకి సీబీఐ.. రన్యారావు పెళ్లికి ఖరీదైన గిఫ్ట్‌లు.. వీడియో పరిశీలిస్తున్న అధికారులు
- రన్యారావు కేసులో రంగంలోకి దిగిన సీబీఐ
- రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరు
- పెళ్లి వీడియో పరిశీలిస్తున్న సీబీఐ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటి దాకా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ అధీనంలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించింది.
రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనుక.. ప్రముఖ రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుకు మూడు నెలల క్రితమే ప్రముఖ ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరినే వివాహం చేసుకుంది. కానీ అతడితో సరైన సంబంధాలు లేవన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి మాత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యారు. అంతేకాకుండా రన్యారావుకి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ దిశగా ఫోకస్ పెట్టింది. రన్యారావు పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు. ఖరీదైన గిఫ్ట్‌లు తీసుకొచ్చింది ఎవరు? అన్న కోణంలో పెళ్లి నాటి వీడియోలను.. మండపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ఇది కూడా చదవండి: ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు
రన్యారావు.. గతేడాది నుంచి అనేకమార్లు దుబాయ్ వెళ్లింది. ప్రతి ట్రిప్‌లో భారీగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ ఎన్నడూ పట్టుబడలేదు. వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే రన్యారావు తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్‌పోర్టు నుంచే బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: KCR : అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
అయితే రన్యారావు పాపం పండి.. మార్చి 3న మాత్రం డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆ సమయంలో ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు.. తొడల దగ్గర స్టిక్కర్లు అంటించుకున్నట్లు కనిపెట్టారు. ఇక ఆమె ఇంటి దగ్గర సోదా చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరిపై కూడా దృష్టి పెట్టారు. ఇతడు కూడా పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అసలు ఆమె వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. వీఐపీ ప్రొటోకాల్ ఎలా ఉపయోగించుకోగలిగింది అనే అంశంపై సీబీఐ కూపీలాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: పరుగులు పెడుతున్న పసిడి.. రూ. 490 పెరిగిన తులం గోల్డ్ ధర.. రూ. 2 వేలు పెరిగిన కిలో వెండి ధర
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!