అమెరికా.. ప్రపంచంలోనే అగ్ర రాజ్యం. ఇక రక్షణ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఎంతో పగడ్బందీగా.. రహస్యంగా ఉంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం లీక్ కావడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. యెమెన్‌పై భీకర దాడులు చేసేందుకే అమెరికా ప్రణాళికలు రచించింది. హౌతీ రెబల్స్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ అయిపోయింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. అలా లీకైందంటూ పెంటగాన్ అధికారులు తలలు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Air Conditioners: ఏసీలు ఇలా వాడండి.. విద్యుత్ ఆదా చేయండి..!
అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ భార్యనే లీక్ చేసినట్లుగా గుర్తించారు. యెమెన్‌పై దాడుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత లాయర్‌తో ఆమె షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. అలా యుద్ధ ప్రణాళిక ముందుగానే తెలిసిపోయింది. అయినా ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ చాట్ ఎలా లీక్ అయిందో అర్థం కావడం లేదని అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ తెలిపారు. ఆ గ్రూప్ తానే క్రియేట్ చేశానని.. పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనంలో పేర్కొంది. అయినా అత్యంత సీరియస్ సందేశాలు లీక్ కావడంపై అనేక సందేహాలు వ్యక్తం చేసింది. ఇక హెగ్సెత్ భార్య, మాజీ ఫాక్స్ న్యూస్ నిర్మాత జెన్నిఫర్ కూడా విదేశీ సైనిక ప్రతినిధులతో రహస్య సమావేశాలకు హాజరైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ మరో కథనంలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Malavika : టాలీవుడ్ డైరెక్టర్స్ పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్.
ఇదిలా ఉంటే ఈ కథనాలపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ గానీ.. అటు వైట్‌హౌస్ వర్గాలు గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడం విశేషం. అంతేకాకుండా అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి.. అలాగే ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్‌లో ఇతర వ్యక్తులు ఎలా ప్రవేశించారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశేషమేంటంటే ఇప్పటి వరకు ట్రంప్ పరిపాలన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవైపు యుద్ధ ప్రణాళిక లీకైన అంశంపై గురించి తన దగ్గర సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భద్రతా ఉల్లంఘనను ట్రంప్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. కానీ డెమోక్రట్లు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. నూతన పాలకవర్గం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Gummadi Sandhya Rani: గిరిజనల కోసం స్పెషల్ డీఎస్సీ..!