పహల్గామ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చారు. హర్యానాలోని కర్నాల్‌లో వినయ్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ కళ్లు చెమర్చాయి. కళ్లద్దాలు తీసుకుని కన్నీళ్లు తుడుచుకున్నారు. ధైర్యంగా ఉండాలని కేంద్రమంత్రి భరోసా కల్పించారు.
ఇది కూడా చదవండి: Vinay Narwal: భార్యతో ఆర్మీ ఆఫీసర్ డ్యాన్స్.. చివరి వీడియోలు వైరల్
వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరి కొచ్చిలో పోస్టింగ్ పొందారు. 2025, ఏప్రిల్ 16న వివాహం జరిగింది. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు, అధికారులంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జంట హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. వచ్చిన బంధువులంతా ఇళ్లకు వెళ్లారు. ఇంతలోనే చావు కబురు అందింది. ముష్కరుల దాడిలో వినయ్ నర్వాల్ చనిపోయినట్లుగా సమాచారం అందింది. అందరూ దు:ఖంలో మునిగిపోయారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న అధికారిని పొట్టనపెట్టుకున్నారని స్థానికులంతా వాపోయారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు
ఇక తాజాగా వినయ్ నర్వాల్-భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో చాలా సంతోషంగా హనీమూన్ గడుపుతున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ముష్కరుల రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అంతే తూటాల వర్షానికి వినయ్ నర్వాల్.. భార్య కళ్ల ముందే కుప్పకూలిపోయాడు.
#WATCH | Karnal, Haryana: Union Minister Manohar Lal Khattar reached the residence of Indian Navy Lieutenant Vinay Narwal, who was killed in the Pahalgam terror attack yesterday. pic.twitter.com/RURXgdZ4PP
— ANI (@ANI) April 24, 2025