ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. 24 గంటల వ్యవధిలోనే మరోసారి శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
రష్యాలో భూకంపం సంభవించింది. కురిల్ దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది. 12 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాల కోసం బీమా నిబంధనలను సడలించింది. మరణ ధృవీకరణ పత్రం స్థానంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ విమానయాన సంస్థలు చెల్లించే ఏదైనా ప్రభుత్వ పత్రంతో పరిహారాన్ని అందిస్తామని వెల్లడించింది.
బ్రిటన్ కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కోసం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. 100 లక్ష్యాలను 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కన్నుమూశారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ రూపానీ విమానం ఎక్కారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లలను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ అన్నారు.