అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అందరూ చనిపోతే.. ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాపీగా బయటకు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో కూర్చున్నాడు.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది.
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అలానే కొనసాగుతోంది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు.
ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్‌కు అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.
పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్లో శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగా ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్‌పై ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌లోని ఒక ప్రాంతంపై దాడులు చేసింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది.
ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని మోడీ పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు.