పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్‌లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్‌లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెళ్లాయి.
ఇది కూడా చదవండి: Honeymoon Murder: రాజా రఘువంశీ-సోనమ్‌కి పెళ్లి కుదిర్చింది ఎవరు? బంధువు ఏం చెప్పాడంటే..!
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని ప్రపంచ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ పూర్తిగా సన్నద్ధమైపోయినట్లుగా అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
ఇటీవల ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి ట్రంప్‌తో నెతన్యాహుకు విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. పైగా ఇరాన్‌తో అణు ఒప్పందం కూడా ఇజ్రాయెల్‌కు రుచించనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. వెంటనే ట్రంప్.. నెతన్యాహుతో ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. దాడుల ప్లాన్ పక్కన పెట్టాలని ట్రంప్ కోరారు. అందుకు నెతన్యాహు నిరాకరించినట్లు సమచారం.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇరాన్ అప్రమత్తం అయింది. ఒకవేళ ఏదైనా జరిగితే అందుకు అమెరికా బాధ్యత వహించాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. విదేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇరాన్‌కు చెందిన ఎక్స్ ట్విట్టర్‌లో ‘‘మేము కూడా సిద్ధంగా ఉన్నాం.’’ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుతం పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమని.. దౌత్య సిబ్బంది.. సైనిక కుటుంబాలు తక్షణమే వెనక్కి వచ్చేయాలని ట్రంప్ సూచించారు.