ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. తాజాగా ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది.
ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించినట్లు పేర్కొన్నారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు. 24 గంటల్లో దశలవారీగా కాల్పుల విరమణ జరుగుతోందని వెల్లడించారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. ఆరు సార్లు ప్రయోగం వాయిదా పడింది. బుధవారం యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది.
ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని వెల్లడించింది. అన్నట్టుగానే ఇరాన్.. తాజాగా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది.