భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. ఆరు సార్లు ప్రయోగం వాయిదా పడింది. బుధవారం యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభం కానుందని పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: TNPL 2025: బౌలింగే కాదు.. బ్యాటింగ్ లోనూ తగ్గేదేలే.. అద్భుతం చేసిన వరుణ్ చక్రవర్తి
వాతావరణం, సాంకేతిక కారణాలు కారణంగా ఆరుసార్లు ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఎగరనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉంటారు.
ఇది కూడా చదవండి: JD Vance: ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన
యాక్సియం-4 మిషన్ ప్రయోగ.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉంది. కానీ జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు జూన్ 25న యాత్ర ప్రారంభం అవుతోంది.
.@NASA, @Axiom_Space, and @SpaceX are targeting 2:31 a.m. EDT, Wednesday, June 25, for the launch of Axiom Mission 4 to the orbital outpost. https://t.co/kbAFZXZjNv
— International Space Station (@Space_Station) June 23, 2025