సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై రెండు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తు్న్నాయి. ఇప్పటికే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సాంకేతిక సహాయంతో ఫ్లైట్ రికార్డుల నుంచి డేటాను డౌన్లోడ్ చేసుకున్నట్లు జూన్ 26న పౌర విమానయాక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమానం ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో మంటలు చెలరేగాయి. పొగలు, నిప్పురవ్వులు రావడంతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. కానీ యువకుడు మాత్రం కామంతో కళ్లు నెత్తికెక్కాయి. ప్రేమించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో యువతి మరణించింది. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గం ప్రత్యేక ఫోకస్ పెటింది. బీహార్‌లో తొలి అణు విద్యుత్ ప్లాంట్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.