దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. కానీ యువకుడు మాత్రం కామంతో కళ్లు నెత్తికెక్కాయి. ప్రేమించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో యువతి మరణించింది. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్‌లో 19 ఏళ్ల యువతి నేహా నివాసం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నివాసి అయిన 26 ఏళ్ల తౌఫీక్ ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అందుకు యువతి నిరాకరించింది. అయితే సోమవరం బుర్ఖా ధరించి యువతి ఇంటికి వచ్చాడు. ఐదవ అంతస్థుపై మాట్లాడుతుండగా కిందకు తోసేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలు పాలైన యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలించారు. అజ్ఞాతంలో ఉన్న తౌఫీక్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ShraddhaDas : శ్రద్దగా, పద్దతిగా.. నడుమందాలు చూపిస్తున్న శ్రద్దా దాస్
బాధితురాలిని నేరుగా కలిసేందుకు మారువేషంలో వచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గుర్తించకుండా ఉండేందుకు అలా చేసినట్లు చెప్పాడు. బుర్ఖా ధరించి సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీడియో ఆధారం నిందితుడిని పట్టుకున్నారు. తౌఫీక్-యువతి మధ్య చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తౌఫీక్ వేరొక అమ్మాయిను పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడుతుండగా బాధితురాల మధ్య ఘర్షణ తలెత్తిందని.. ఈ కారణంతోనే యువతిని తోసేశాడని చెప్పారు. బిల్డింగ్‌పైన ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. అయితే పోలీసుల వాదనను బాధిత కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదని.. కుమార్తె అతడికి రాఖీ కూడా కట్టిందని చెప్పుకొచ్చారు. దాదాపు మూడు సంవత్సరాలుగా తౌఫీక్ తమకు తెలుసునని, అతను తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని బాధిత కుటుంబం చెబుతోంది.