ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గం ప్రత్యేక ఫోకస్ పెటింది. బీహార్‌లో తొలి అణు విద్యుత్ ప్లాంట్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అణు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత బీహార్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీహార్ నుంచి అభ్యర్థన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: DCP Suresh: తల్లిపై కక్ష్య పెంచుకుంది.. చున్నీని గొంతుకు బిగించి చిత్రహింసలు..!
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీ బీహార్‌లో పర్యటించారు. తాజాగా బీహార్‌లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్లాంట్‌కు సంబంధించిన విధివిధానాలు త్వరలో తెలియజేస్తామని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దేశ వృద్ధి రేటు పెరిగేకొద్దీ విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని అన్నారు. అణుశక్తి నమ్మదగిన, స్థిరమైన, దీర్ఘకాలిక ఇంధన ఎంపిక అని కేంద్ర విద్యుత్ మంత్రి చెప్పారు. విద్యుత్ రంగంలో బీహార్ వెనుకబడి ఉందని.. తాజా నిర్ణయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఖట్టర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: UP: నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా.. తొలి రాత్రి నవ వధువు హల్‌చల్.. ఆలస్యంగా వెలుగులోకి..!