Maruthi: జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా డైరెక్టర్ మారుతి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
READ ALSO: Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ముందుగా ఆయన నిర్మాత విశ్వాకి ధన్యవాదాలు తెలిపిన, ఆ తర్వాత ప్రభాస్‌ని పెట్టుకుని సాదాసీదా సినిమా చేయడం లేదని అన్నారు. “అంత ఈజీ కాదు ఈ సినిమా, దీని వెనుక చాలా కష్టం ఉంది. మేము ఒక రెబల్ స్టార్‌ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి, భోజనం పెట్టి పంపించేస్తే సరిపోయే సినిమా తీయలేదు ఇది. ఆయన వచ్చినప్పుడు అలాంటి రేంజ్ అవుట్‌పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్‌కు వచ్చిన వాళ్లకు మేము పెట్టిన 100% ఎఫర్ట్ అర్థమవుతుంది.
నెక్స్ట్ అసలు జర్నీ గురించి ఇక్కడ కొంచెం మాట్లాడాలి, నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు. కథల్లోనూ, పుస్తకాల్లోనూ వింటూ చదువుతూ ఉంటాం.. దేవుడు దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావోడి కోసం కిందకి వచ్చింది అని. మా రియల్ లైఫ్ లో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాంబే నుంచి ఫోన్ వచ్చింది. ఆయన రాముడి గెటప్‌లో ఉన్నప్పుడు ఈ మారుతి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయనని ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయనకు అసలు అవసరం లేదు, ఆయన బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా.. ఇంకా ఎక్కడికో మసామారా అని సౌత్ ఆఫ్రికాలోని ఒక ప్రాంతానికి వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అంటే కింద నుంచి పై వరకు చూశాడు. ‘నా హీరో ఎవరో తెలుసా?’ అని అడిగా, ‘ఓ బాహుబలి హీరోనా?’ అని అడిగాడు. ఆఫ్రికాలో వేరే జాతి వాళ్లకు కూడా ఆయన తెలిసిపోయారు. రాజమౌళి గారికి ప్రతి డైరెక్టర్ చాలా చాలా రుణపడి ఉన్నాం” అని అన్నారు.
READ ALSO: Tara Sutaria : స్టేజీపై తార సుతారియాకు సింగర్ ముద్దు..! బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్