Ahmedabad Plane Crash: పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలి.. నివేదికపై బాధిత కుటుంబాలు ఆందోళన
- పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలి
- నివేదికపై బాధిత కుటుంబాలు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చాక బాధిత కుటుంబాల్లో ఆవేదన మొదలైంది. రెండు ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా 15 పేజీల ప్రాథమిక నివేదికలో తేటతెల్లమైంది. అయితే ఈ నివేదికపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన సాంకేతిక లోపాన్ని పక్కన పెట్టి.. పైలట్లపై నిందలు మోపడం ఏ మాత్రం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నివేదికలు అంగీకరించబోమని వాపోతున్నారు.
ఇది కూడా చదవండి: Ileana : అమ్మకి ఫోన్ చేసి ఏడ్చా.. సినిమా వదిలేయాలని అనుకున్నా
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ప్రాథమిక నివేదికను అంగీకరించబోమని అమీన్ సిద్ధిఖీ అన్నారు. సిద్ధిఖీ బావమరిది అకీల్, అతడి భార్య, కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. టేకాఫ్‌కు ముందు ఇంధన్ స్విచ్‌లు ఎలా ఆపివేయొచ్చు.. ఇది పైలట్ తప్పిదమా? మరేదైనానా? అని సిద్ధిఖీ ప్రశ్నించారు. ఎయిర్‌లైన్ సంస్థ అందించే పరిహారాన్ని సిద్ధిఖి తిరస్కరించారు. తమకు పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా పలువురు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలని వేడుకున్నారు.
ప్రాథమిక నివేదిక..
ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్‌లు ఆపివేయబడ్డాయని తెలిపింది. 15 పేజీల ప్రాథమిక నివేదికలో సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సూచించింది. అయితే ప్రమాదం జరిగిన విమానంలో ఇంధన స్విచ్‌లను ఎయిరిండియా రెండు సార్లు మార్చినట్లు సమాచారం. అంటే రెండు స్విచ్‌లు కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయని తెలుస్తోంది. అయితే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది. అంటే పైలట్ల మధ్య ఏదో గందరగోళం నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్య చర్యతో రెండు ఇంధన స్విచ్‌లు ఆపేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఖండన..
ఇంధన స్విచ్ ఆఫ్‌పై వస్తున్న నిందను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక రాకుండానే ఎలా కథనాలు ప్రసారం చేస్తారంటూ నిలదీస్తున్నాయి. తుది నివేదిక వచ్చాక అప్పుడు అంగీకరిస్తామని పైలట్ సంఘాలు పేర్కొన్నాయి. అప్పుటి వరకు ఎలాంటి తప్పుడు కథనాలు ప్రచురించొద్దని.. ప్రజలను గందరగోళానికి నెట్టొద్దని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రాథమిక నివేదికను వైట్‌సైట్‌లో ఉంచారు. కానీ దానిపై ఎవరూ సంతకం చేయలేదు. పారదర్శకతను కోరుకుంటున్నామని.. దర్యాప్తు ప్యానెల్‌లో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతున్నట్లు పైలట్ సంఘాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Nimisha priya Case: నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై ఏం చేయలేం.. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!