Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు బెంబేలు
- ఇండోనేసియాలో భారీ భూకంపం
- 6.8 తీవ్రతతో భూకంపం
- భయంతో ప్రజలు బెంబేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: Naveen Chandra : హనీతో నవీన్ చంద్ర కొత్త ప్రయాణం ప్రారంభం ..!
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 12:49 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి, సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Live-in Relationship: భార్యతో గొడవ పడుతుందని.. సహజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడి దారుణం
ఇండోనేషియాలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2021లో ఇండోనేసియాలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మందికి పైగా చనిపోయారు. ఇక 2018లో పాలూ ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ కారణంగా 2,200 మందికి పైగా మృతి చెందారు. ఇక 2004లో 9.1 తీవ్రతతో అత్యంత భీకరమైన భూకంపం సంభవించింది. హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీతో ఇండోనేషియాలోనే దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రభావం చూపించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!