Tara Sutaria : బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా , ఆమె ప్రియుడు వీర్ పహారియా తాజాగా ముంబైలో జరిగిన ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో సందడి చేశారు. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాన్సెర్ట్ మధ్యలో ఏపీ ధిల్లాన్ ఆహ్వానం మేరకు తార సుతారియా స్టేజీపైకి వెళ్లగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం , అక్కడే ఉన్న వీర్ పహారియా రియాక్షన్ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
కాన్సెర్ట్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, తార సుతారియా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ స్టేజీపైకి చేరుకుంది. ఆమె అక్కడకు వెళ్లగానే సింగర్ ఏపీ ధిల్లాన్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టాడు. అనంతరం వీరిద్దరూ కలిసి ధిల్లాన్ పాడిన హిట్ సాంగ్స్ ‘థోడీ సీ దారూ’ వంటి పాటలకు స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో కెమెరా కన్ను ఆడియన్స్‌లో కూర్చున్న తార బాయ్‌ఫ్రెండ్ వీర్ పహారియా వైపు మళ్లింది. స్టేజీపై తన ప్రియురాలికి మరో వ్యక్తి ముద్దు పెట్టడం చూసిన వీర్, ఆ సమయంలో కొంత అసౌకర్యంగా, గంభీరంగా కనిపించినట్లు వీడియోలో స్పష్టమవుతోంది.
Duvvada Srinivas: నా ప్రాణాలకు ముప్పు వస్తే ఆ ఇద్దరే కారణం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన దువ్వాడ..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. “ఏపీ ధిల్లాన్ స్టేజీని కెమిస్ట్రీ ల్యాబ్‌గా మార్చేశాడు, పాపం వీర్ ముఖం చూస్తుంటే టెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది” అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం దీన్ని కేవలం ఒక ఫ్రెండ్లీ జెశ్చర్‌గా (స్నేహపూర్వక చర్య) మాత్రమే చూడాలని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొందరు నెటిజన్లు “డబుల్ స్టాండర్డ్స్” గురించి ప్రస్తావిస్తూ.. ఒకవేళ వీర్ పహారియా స్టేజీపై వేరే అమ్మాయిని ఇలా ముద్దు పెట్టుకుంటే నెటిజన్లు ఊరుకునేవారా? అని ప్రశ్నిస్తున్నారు.
తార సుతారియా , వీర్ పహారియా గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2025 ఆగస్టులో తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన ఈ జంట, అప్పటి నుండి పార్టీలు, విమానాశ్రయాలు , ఇతర వేడుకల్లో కలిసే కనిపిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీర్ మాట్లాడుతూ.. తాము ఎప్పుడూ తమ ప్రేమను దాచుకోలేదని, ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఎక్కడికైనా వెళ్లినప్పుడు వ్యక్తపరచడానికి వెనకాడబోమని తెలిపాడు. అయితే, తాజా ఘటనలో వీర్ రియాక్షన్ చూశాక, వీరిద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందా? లేదా అనే అనుమానాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, తార సుతారియా , ఏపీ ధిల్లాన్ మధ్య ఉన్న ఆన్-స్టేజ్ కెమిస్ట్రీ మాత్రం ఈ కాన్సెర్ట్‌లోనే హైలైట్‌గా నిలిచింది.