టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
రష్యాలో వాట్సాప్ నిషేధానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాట్సాప్‌ను రష్యా బెదిరించింది. రష్యన్ చట్టాన్ని పాటించడంలో విఫలమైతే వాట్సాప్‌ను పూర్తిగా నిషేధం విధిస్తామని రష్యా రాష్ట్ర కమ్యూనికేషన్ వాచ్డాగ్ బెదిరించింది.
శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత పెద్ద కుట్ర జరిగిందో దర్యాప్తు అధికారులు తేల్చారు. టెర్రర్ మాడ్యూల్లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు.
దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసంలో డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
వామ్మో.. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య రెండు రోజులు ధరలు తగ్గాయి. దీంతో ధరలు దిగి రావొచ్చని పసిడి ప్రియులు భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా గోల్డ్ లవర్స్‌కు షాకిస్తున్నాయి. శనివారం మరోసారి భారీ పెరిగిపోయాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్‌పై కొద్దిరోజులుగా ఫైటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇటీవల రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పవర్ షేర్ చేయాల్సింది డీకే.శివకుమార్ వర్గం మొండిపట్టుపట్టింది.
హాంకాంగ్ చరిత్రలోనే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది. అనేక కుటుంబాల్లో అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం హాంకాంగ్ బహుళ అపార్ట్మెంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు.